![]() |
| Happy New Year |
న్యూ ఇయర్ వేడుకలకు కొత్త రూల్స్
న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు యువత హంగామా చిన్నగా ఉండదు. అర్ధరాత్రి కేక్‌లు కట్ చేయడం, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేయడం, బైక్‌లతో రోడ్లపై హల్‌చల్ చేయడం ఇలా పలు రకాలుగా వాళ్లు పిచ్చాపాటిగా వేడుకలు జరుపుకుంటారు. ఈ క్రమంలో న్యూ రోజు జరిగే ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఏటా దీన్ని తగ్గించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు 2020 వేడుకల్లో… రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు, అపశృతులుకు ఆస్కారం లేకుండా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. పోలీసులు జారీ చేసిన నిబంధనలను ఈవెంట్స్ నిర్వాహకులు, హోటల్స్, పబ్ యాజమాన్యాలు, ఇతరులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అటు, మహిళలకు పటిష్ట భద్రత, రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా.. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లు తమ విజన్ 2020 లక్ష్యాలను వివరించారు.నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి దుర్ఘటనలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాద రహితంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు జంట నగరాల కమీషనర్లు పలు నిబంధనలను రూపొందించారు. న్యూ ఇయర్ నిబంధనలు కింది విధంగా ఉన్నాయి.
నూతన సంవత్సర వేడుకులను రాత్రి 8 నుంచి 1 గంట వరకు నిర్వహించాలి.
వేడుకల నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోవాలి.
వేడుకలు జరిగే ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
డీజేకు అనుమతి లేదు, 45 డెసిబెల్స్ మ్యూజిక్ శబ్దం మించకూడదు.
డ్రగ్స్, మత్తు పదార్థాలు విక్రయించవద్దు.
ట్రాఫిక్ రద్దీ, జామ్‌లు తలెత్తకుండా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి.
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. వేడుకల్లో అశ్లీలం ఉండవద్దు.
మైనర్లకు ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో మద్యం సరఫరా చేయొద్దు.
వేడుకల సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే పానీయాలు తాగొద్దు.
మహిళలు, పిల్లలను నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగే వేడుకలకు పంపొద్దు.
క్యాబ్, ఆటో డ్రైవర్లు అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే డయల్ 100, లేదా హాక్ ఐ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.
వేడుకల ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ నేరమని సూచిక బోర్డులు పెట్టాలి.
డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడితే వాహనం సీజ్, 10 వేల జరిమానా.
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యలు ఎదురైతే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నం. 850-041-1111 కు సమాచారం ఇవ్వాలి.
అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉన్నా, వస్తువులు కనపడినా వెంటనే డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నం. 949-061-7111, సైబరాబాద్ వాట్సాప్ నం. 949-061-7444 కు సమాచారం అందించాలి.
అటు.. డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఆర్‌పై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాలకు అనుమతి లేదని రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేశ్ భగవత్, సజ్జనార్‌లు స్పష్టం చేశారు. దీంతో పాటు రెండు పోలీస్ కమిషనరేట్‌ల పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లపై రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు వాహనాలను అనుమతించరు.
విజన్ 2020లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరం చేస్తే శిక్ష ఖాయం దిశగా దర్యా ప్తు, విచారణ ఉంటుందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కేసుల సత్వర విచారణను పూర్తి చేస్తామని… రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గిస్తామన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పౌరులకు మరింత మెరుగైన పోలీసు సేవలను అందించేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు సమర్థవంతమైన యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్తామన్నారు. మహిళల భద్రత పై పటిష్టమైన చర్యలు తీసుకుంటామని… కొత్త సంవత్సరం వేడుకల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు.
New Rules for New Year's Celebrations
The New Year has come and gone. They celebrate in a variety of ways, such as cutting midnight cakes, having fun with friends, hulking on the roads with bikes. The number of accidents on New Day is also high. The Telangana Police Department is taking steps to reduce it annually. In this year's 2020 celebrations… Rachakonda and Cyberabad police have developed a number of rules and guidelines to ensure that road accidents, accidents and defilements are maintained calmly. Event organizers, hotels, pub owners and others must comply with the rules issued by the police. Rachakonda and Cyberabad Police Commissioners have outlined their Vision 2020 objectives, which aim to strengthen women safety and reduce road accidents.The New Year's celebrations were held without any tragedy. Twin city commissioners have made several regulations to ensure New Year's Eve is free of risk. New Year's terms are as follows.
New Year's Eve must be held from 8 to 1 p.m.
The organizers of the ceremonies must obtain the permission of the police.
Seasonal cameras must be installed in the area where the ceremony takes place.
No DJ is allowed, no more than 45 decibels of music noise.
Do not sell drugs or drugs.
Security guards should be set up to prevent traffic congestion and jams.
Parking should be arranged without disturbing the traffic.
Do not give vehicles to minors. Don't be obscene at celebrations.
Do not supply alcohol to minors at events.
Do not drink the drinks offered by unidentified persons during the celebrations.
Do not send women and children to festive occasions.
If the cab or auto driver is suspicious, immediately notify the police via dial 100, or hack-i-app.
Indicator boards should be placed on the grounds that drunk and driving is a crime in celebration areas.
Vehicle Siege, 10 thousand fine if caught in drunk and driving.
Cyberabad Traffic Police WhatsApp no. Information should be provided to 850-041-1111.
Dial 100 or Rachakonda WhatsApp no. 949-061-7111, Cyberabad WhatsApp no. Information should be provided to 949-061-7444.
Rahekonda, Cyberabad Police Commissioners Mahesh Bhagwat and Sajjanar have made it clear that vehicles are not allowed on the ORR from 11 pm to 5 am in view of the December 31 and New Year celebrations. In addition, on the flyovers under the two police commissionerates, vehicles will not be allowed from 11 am to 5 pm.
Rachankonda CP Mahesh Bhagwat said that as part of the Vision 2020, the Rakaconda Police Commissionerate will investigate and prosecute the offense. Fast track courts will complete a quick trial of cases ... Reduce deaths in road accidents. Cyberabad Police Commissionerate has planned to provide better police services to citizens. He has come up with an effective action plan to reduce road accidents. Strict action will be taken on women's safety… If the rules are violated on New Year's Eve, strict action will be taken.
న్యూ ఇయర్ వేడుకలకు కొత్త రూల్స్||New Rules for New Year's Celebrations
Reviewed by Uva Bharath
on
12:17 AM
Rating:
Reviewed by Uva Bharath
on
12:17 AM
Rating:

No comments:
Please do not enter any spam link in comment box