మమ్మల్ని క్షమించు చెల్లి!
భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా అన్న తమ్ముళ్లు అక్కా చెల్లెళ్లు అని ప్రతిరోజు ప్రతిజ్ఞ చేసే వాళ్ళము.
రోజులు గడిచాయి పెరిగి పెద్ద వాళ్ళం అయ్యాము ఇప్పుడు మేము మనుషులము కాదు మగాళ్ళము అంటున్నాము.
దారిన పోయే ప్రతి ఆడపిల్ల ని ఒక ఆట బొమ్మ అని కామంతో నిండిన కళ్ళతో చూస్తున్నాము.
అమ్మాయి అంటే ఒక మనిషి అని తనకు గౌరవం, మనసు,ఆత్మాభిమానం, ఉంటాయని మర్చిపోతున్నాము.
అమ్మాయి అంటే కేవలం ఒక శరీరం మాత్రమే అని ఆ శరీరం మా మృగవాంఛ తీర్చుకోవడం కోసమే అని మా మనసుల నిండా కీచక తత్వాన్ని నింపు కుంటున్నామము.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని అయితే!
ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగి, క్షేమంగా ఇంటికి చేరిన రోజే ఈ నా భారత దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని ఒక గొప్ప నాయకుడు అన్నారు,
అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు జనారణ్యంలో నే మేము మిమ్మల్ని, మీ జీవితాన్ని కాలరాస్తున్నాము.
జనాల మధ్యన సంతోషంగా జీవిస్తూ ఉన్న మిమ్మల్ని పోకిరీలుగా బాధ పెడుతున్నాము.
ఇంట్లో రక్షణ లేదు
బయటా రక్షణ లేదు
స్కూళ్లలో రక్షణ లేదు
కాలేజీలలో రక్షణ లేదు
ఆఫీసుల లో రక్షణ లేదు
చివరికి చిరునవ్వు నవ్వుతూ చిట్టి చిట్టి మాటలతో తల్లి చేతి గోరు ముద్దలు తిని తల్లి కౌగిటిలో నిద్రిస్తున్న పసి పిల్లలను కూడా మానవత్వం మరిచి మీ జీవితాలను కాలరాసిన మృగ చరిత్ర కలిగిన మగ జాతి తల్లి మాది.
దేశం లేదు,
మతం లేదు,
కులం లేదు,
వయసు తేడా అసలే లేదు,
తల్లి కడుపున పుట్టిన పసి పిల్లలు మొదలు పండు ముసలి వరకు ఆడది అయితే చాలు మా మృగ వాంఛతో మిమ్మల్ని బలి తీసుకుంటున్నాము.
తండ్రిలా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకోవలసిన మేము కర్కశంగా మీ పసి హృదయాలను చిదిమేసిన హీనపు చరిత్ర మాది.
గురువులుగా మీకు విద్యాబుద్ధులు నేర్పవలసిన మేము మా విషపు చూపులతో మిమ్మల్ని గాయపరిచిన నీచపు చరిత్ర మాది.
అధికారిగా ఉన్న మేము ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా బ్రతుకుతున్న మిమ్మల్ని వేధించిన దరిద్రపు చరిత్ర మాది.
ఒంటరిగా దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆడపిల్లలకు ఒక తండ్రిగా,ఒక అన్నగా, కనీసం ఒక మనిషిగా కూడా మీకు రక్షణ కల్పించక కుండా
ఒక మగాడిగా మృగాడిగా మారి క్షణకాలపు క్రూరమైన కామపు కోరికలతో మానవత్వాన్ని మరిచి కర్కశంగా మీ బంగారు బ్రతుకులను నిండు నూరేళ్ల మీ జీవితాలను నాశనం చేసినందుకు మమ్మల్ని క్షమించు చెల్లి!!!
మగజాతి కన్నీళ్లతో మీ పాదాలను కడుగుతూ
ఒక భారతీయ సహోదరుడు.
ప్రియాంక రెడ్డి మమ్మల్ని క్షమించు||Please forgive us DPriyanka Reddy
Reviewed by Uva Bharath
on
12:49 AM
Rating:
Reviewed by Uva Bharath
on
12:49 AM
Rating:

No comments:
Please do not enter any spam link in comment box