![]() |
| Aarogya Setu |
AAROGYA SETU App
కరోనా వైరస్ ఉన్నటువంటి వ్యక్తులు మన చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని గుర్తించడానికి ప్రభుత్వం ఒక AAROGYA SETU ఆరోగ్య సేతు అనే యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా కరోనా వైరస్ కలిగిన ప్రదేశానికి మనం ఒకవేళ తెలియకుండా వెళ్ళినట్లయితే మనకు అలారం ద్వారా ఇక్కడ వ్యాధి కలిగిన వ్యక్తులు ఉన్నారు అని మనల్ని హెచ్చరిస్తుంది . అలాగే ఈ ప్రాంతం ఎంత వరకు సురక్షితమైనది అని కూడా మనకు తెలియ చేస్తుంది.AAROGYA SETU
ఆరోగ్య సేతు యాప్ ముఖ్యంగా ఎక్కడికైనా బయటికి వెళ్తున్న వ్యక్తులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యాధి కలిగిన ఈ ప్రాంతాన్ని ముందుగానే ప్రభుత్వం వారు గుర్తించడం వల్ల ఆ ప్రాంతంలో నిషేధం విధిస్తూ ఉంటారు. అయితే అత్యవసరమైన పరిస్థితిలో మనం వెళ్ళినప్పుడు మనల్నిహెచ్చరిస్తుంది. అలాగే మనకు తెలియని ప్రాంతాలు కూడా ఒకవేళ వ్యాధి కలిగిన వారు విదేశాల నుంచి వచ్చిన లేదంటే విదేశాల నుంచి వచ్చిన వారు అనుమానితులుగా ఉన్న వారిని గృహనిర్బంధంలో ఉంచినప్పుడు ఒకవేళ మనకు తెలియకపోయినా అటుగా వెళ్ళినట్లయితే అక్కడ అనుమానితులు ఉన్నట్లు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది.AAROGYA SETU
ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన (GPRS)జిపిఆర్ఎస్ ఆన్ లో ఉండాలి అలాగే (Bluetooth) బ్లూటూత్ కూడా ఆన్ చేసి ఉంచాలి.
AAROGYA SETU ఆరోగ్య సేతు యాప్ ను ఈ క్రింద ఇచ్చిన లింక్ లో డైరెక్ట్ గ Install చేసుకోండి.
Android InstallAppl IOS
ముఖ్య గమనిక:
యాప్ ఉంది కదా అని నాకు ఏం పర్వాలేదు అనేసి బయట తిరగడం అంత క్షేమకరం కాదు. దయచేసి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి. అలాగే వ్యక్తులకు వ్యక్తులకు మధ్య దూరాన్ని పాటించండి. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి . మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం మన దేశాన్ని ఈ కరోనా నుంచి రక్షించుకుందాం.
జైహింద్....
Aarogya Setu App
Reviewed by Uva Bharath
on
10:00 AM
Rating:
Reviewed by Uva Bharath
on
10:00 AM
Rating:

No comments:
Please do not enter any spam link in comment box